ప్రధాని మోదీకి సతీసమేతంగా ఘన స్వాగతం పలికిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్
అమరావతి:, ఇజ్రాయెల్, టెల్ అవీవ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకున్న సందర్బంలో,ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన భార్య సారా నెతన్యాహు విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. స్వయంగా విమానశ్రయంకు చేరుకుని,విమానం వద్దే ప్రధాని మోదీని ఆత్మనీయం కౌగలించుకుని ప్రధాని మోదీతో తనకు వున్న స్నేహంను చాటి చెప్పారు.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్:- “నా ప్రియమైన మిత్రుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇజ్రాయెల్‌కు స్వాగతం” అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ:- ఇజ్రాయెల్‌కు చేరుకున్న ఆనంతరం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ… ప్రధాన మంత్రి నెతన్యాహూ మరియు శ్రీమతి నెతన్యాహూ విమానాశ్రయంలో నన్ను స్వాగతించడం నాకు చాలా గౌరవంగా ఉంది. భారతదేశం-ఇజ్రాయెల్ స్నేహాన్ని బలోపేతం చేసే ద్వైపాక్షిక చర్చలు,ఫలవంతమైన ఫలితాలలో పాల్గొనాలని నేను ఎదురు చూస్తున్నాను. అంటూ తన సోషల్ మీడియాలో వెల్లడించారు.

