బీజెపీ 12వ జాతీయ అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్
అమరావతి: భారతీయ జనతా పార్టీ 12వ జాతీయ అధ్యక్షుడిగా బిహార్ యువనేత నితిన్ నబీన్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, పార్టీ ఇతర నేతలు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.45 ఏళ్ల వయసులో ఈ పదవిని స్వీకరించిన ఆయన బీజేపీ చరిత్రలో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు.
బీజెపీ ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, హర్దీప్సింగ్ పురి, కిరిణ్ రిజుజు, వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో పార్టీ ముఖ్య నేతలు నితిన్ నబీన్‌కు మద్దతుగా నామినేషన్లను పార్టీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఎంపీ డా కె.లక్ష్మణ్‌కు ఈ నామినేషన్ పత్రాలను సమర్పించారు.మొత్తం 37 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. పోటీలో ఒక్కరే ఉండటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.మంగళవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, ముఖ్య నేతల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ, రిటర్నింగ్ ఆఫీసర్ కె.లక్ష్మణ్‌తో కలిసి బీజేపీ నూతన అధ్యక్షుడి పేరును ప్రకటించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

