మమతా బెనర్జీ ప్రభుత్వంను రాష్ట్ర ప్రజలు తరిమికొట్టాలి-ప్రధాని మోదీ
అమరావతి: పశ్చిమ బెంగాల్లో మహా జంగిల్ రాజ్ పాలన సాగిస్తున్న మమతా బెనర్జీ ప్రభుత్వంను గద్దె దింపాల్సిన సమయం వచ్చిందని,,15 సంవత్సరాల తృణమృల్ కాంగ్రెస్ ప్రభుత్వంను రాష్ట్ర ప్రజలు తరిమికొట్టాలని దృఢంగా నిశ్చయించుకున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.అదివారం ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో పర్యటించారు. అక్కడ నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
ఇండియా గేట్ ముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత బీజేపీకి మాత్రమే దక్కుతుందని అన్నారు. మొదటి సారిగా ఆజాద్ హిందు ఫౌజ్‌కు ఎర్రకోట దగ్గర గౌరవం దక్కిందని తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని ఓ దీవికి నేతాజీ పేరు కూడా పెట్టామని వెల్లడించారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే బెంగాలీ భాషకు క్లాసికల్ భాషగా గౌరవం దక్కిందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం శ్రద్ద తీసుకున్న కారణంగానే దుర్గా మాత పూజకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు కాకుండా తృణమూల్ కాంగ్రెస్ అడ్డుకుంటోందని మండిపడ్డారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ,, తన మీద, బీజేపీ మీద ఉన్న కోపాన్ని బెంగాల్ ప్రజల మీద చూపిస్తోందని,,దింతో వారు ఇబ్బందిపడేలా చేస్తోందని విమర్శించారు. బెంగాల్ ప్రజలు క్రూరమైన TMS ప్రభుత్వానికి ఓ గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు.

