నాసిరకం పనులు నాలుగు రోజులకే లీకులు…
రామలింగాపురం అండర్ బ్రిడ్జిని అత్యంత వైభవంగా రూ.1.17 కోట్లతో సుందరీకరంచి ప్రారంభించి రోజుల గడవక ముందే నీటి లీకేజీలు అవుతున్నాయి. మరి అంత డబ్బు పెట్టి సిద్దం చేసిన అండర్ బ్రిడ్జిలో నీరు లీకు అవుతుందంటే,, కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులకు పనులు చేయించటం చేతకాలేదా? లేక కాంట్రక్టర్లు ఉత్తుత్తి పనులు చేశారా? అన్న ప్రశ్న నగరవాసుల్లో తల్తేతుంది. అంటే నగరంలో జరిగే పనులు అన్ని ఇంత నాసికరంగా జరుతున్నాయా ? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతొంది ఇందుకు సమాధానం ఎవరు ఇస్తారు?
నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక రామలింగాపురం అండర్ బ్రిడ్జి ప్రాంతంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి శనివారం పర్యటించారు.అండర్ బ్రిడ్జి ప్రాంతంలో లీకేజీల ద్వారా నీరు విడుదల అవుతూ రోడ్డుపై చేరి ఉండటాన్ని కమిషనర్ గమనించి అందు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని నీటి లీకేజీ ఆగేలా పనులను చేపట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషగిరిరావు, సిబ్బంది పాల్గొన్నారు.

