టీడీపీ సీనియర్ నాయకులు జాకిర్ షరీఫ్ మృతి
నెల్లూరు: టీడీపీ సీనియర్ నాయకుడు, నగరంలోని 42, 43 డివిజన్ల క్లస్టర్ ఇంచార్జి మహమ్మద్ జాఫర్ షరీఫ్ (జాకిర్) ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.నాయకులు అందించిన వివరాలు ఇలా వున్నాయి.. శుక్రవారం విజయవాడ నుంచి మరో ముగ్గురు స్నేహితులతో కలసి కారులో నెల్లూరుకు బయదేరారు.ఒంగొలు జిల్లా మేదరెమెట్ట సమీపంలో కారు రోడ్డు డివైడర్ ను ఢీ కొనడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.వెంటనే స్పందించిన స్థానికులు అయనను ఒంగొలులోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.వైద్యులు చికిత్స అందించినప్పట్టికి ఫలితం లేకపోయిందని సమాచారం.అయనతో పాటు కారులో ప్రయాణించిన వారికి కూడా తీవ్ర గాయాలు కావడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే మంత్రి నారాయణ,ఒంగొలు ఆసుపత్రిలో జాకీర్ చికిత్స అందిస్తూన్న డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి వివరాలు అందాల్సి వుంది.?
మంత్రి నారాయణ:- టీడీపీ సీనియర్ నాయకులు మహమ్మద్ జాఫర్ షరీఫ్ (జాకిర్ ) మృతి పట్ల మంత్రి పొంగూరు నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.నెల్లూరు నగరంలోని 42, 43 డివిజన్ల క్లస్టర్ ఇంచార్జి, పార్టీ సీనియర్ నాయకులు జాకిర్ ఒంగోలు సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని,,ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆయన్ని ఆస్పత్రికి తరలించి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడవడం బాధాకరం అన్నారు..”జాకిర్ పార్టీ బలోపేతానికి, ముఖ్యంగా డివిజన్ స్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు… ఆయన మరణం టీడీపీకి-స్థానిక ప్రజలకు తీరని లోటన్నారు.. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు

