బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చెంపదెబ్బ
అమరావతి: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చెంపదెబ్బ తగిలింది.బొగ్గు కుంభకోణంలో మానీ ల్యాండరింగ్ అరోపణలపై జనవరి 8న కోల్కతాలోని ఐ-ప్యాక్ (I-PAC) కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్న సమయలో,మమతా బెనర్జీ,ఈడీ అధికారులను బెదిరించి మరి అక్కడ వున్న ఫైల్స్,హర్డ్ డిస్క్ లను తీసుకుని వెళ్లింది.అంతే కాకుండా ఈడీ అధికారులపై ఎదురు కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులపై నమోదైన FIR లపై స్టే విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ సందర్బ:లో కొన్ని కఠినమైన వ్యాఖ్యలు చేసింది. ఇది చట్ట ఉల్లంఘన కిందికి వస్తుందని అభిప్రాయపడింది. కేంద్ర దర్యాప్తు సంస్థల పనిలో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం తీవ్రమైన విషయమని, ఇది ‘అరాచకానికి’ దారితీస్తుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

