ముష్కరుల దాడులను తట్టుకుని 1000 సంవత్సరాలుగా నిలబడిన సోమ్‌నాథ్ మందిర్-ప్రధాని మోదీ
స్వాభిమాన్ పర్వ్ ఉత్సవాలు..
అమరావతి: స్వాతంత్ర్యం తరువాత సోమనాథ్ ఆలయ పునరుద్ధరణను వ్యతిరేకించిన శక్తులు భారతదేశంలో “ఉనికిలో ఉంటూ, చురుకుగా వ్యవహరిస్తున్నయని” ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌లోని సోమనాథ్ దేవాలయంలో జరుగుతున్న ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ వేడుకల్లో శనివారం పాల్గొన్నారు. తొలుత ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో ప్రధాని పాల్గొని, వేదపండితుల సమక్షంలో మహదేవునికి ప్రత్యేక పూజలు చేశారు. సోమనాథేశ్వరుడి ఆలయం ప్రాగంణంలో ఏర్పాటు చేసిన డ్రోన్ షోను ఆసక్తిగా తిలకించారు.అనంతరం ప్రధాని మాట్లాడుతూ దేశంలోని విఛ్చిన్నకర శక్తులు,భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలుపన్నుతూ, అంతర్గతంగా ప్రజలను రెచ్చకొట్టి, దేశంలో ఆశాంతిని పెంచేందుకు వారు నిరంతరం ప్రయత్నిస్తున్నరని,,వారిని ఓడించడానికి దేశం అప్రమత్తంగా, ఐక్యంగా-శక్తివంతంగా ఉండాలన్నారు. “వారు ఇప్పుడు కత్తులతో లేరు, కానీ వారి పద్ధతులను మార్చుకున్నారు.”అని అన్నారు. సనాతన సంప్రాదాయంను విచ్చిన్నం చేసేందుకు 1,000 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని ఓడించడానికి వచ్చారు, కానీ హిందూ పాలకులు వారిని దూరంగా ఉంచారన్నారు.
సోమ్‌నాథ్ ఆలయంపై 1026లో దాడి:- మూడు రోజుల గుజరాత్ పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ శనివారం సోమ్‌నాథ్‌కు చేరుకున్నారు. అక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత అక్కడ జరిగిన ‘ఓంకార్ మంత్ర’ అనే సామూహిక ఆలపన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. సోమ్‌నాథ్ ఆలయంపై 1026వ సంవత్సరంలో దాడి జరిగింది. ఆ దాడి నుంచి తట్టుకుని వెయ్యేళ్లుగా సోమ్‌నాథ్ ఆలయం భక్తుల పూజలు అందుకుంటోంది. ఆలయంపై దాడి జరిగి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రస్తుతం సోమ్‌నాథ్ స్వాభిమాన్ పర్వ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
