NATIONAL

భారతీయులకు అన్యాయం జరిగితే ప్రతీకారం తీర్చుకోవాల్సిందే- అజిత్ డోభాల్

అమరావతి: మనం చూస్తున్న ప్రపంచంలో జరుగుతున్న ఈ (యుద్దం) సంఘర్షణలన్నింటిలోనూ ఒక దేశం తన ఇష్టాన్ని మరొక దేశంపై రుద్దుతోందన్నారు. భారతదేశ చరిత్రలో గతంలో ఎన్నో దాడులు, అణిచివేతలు జరిగాయని, వాటికి ప్రతీకారం తీర్చుకోవాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ (81) అన్నారు. ఢిల్లీలో శనివారంనాడు దేశవ్యాప్తంగా 3,000 మంది యువ ప్రతినిధులు పాల్గొన్న’వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ కార్యక్రమంలో యువతను ఉద్దేశించి అజిత్ డోభాల్ ప్రసంగిస్తూ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని, ప్రతీకారం మంచిదే అయినా దానిని ప్రేరణ శక్తిగా మలుచుకోవాలని సూచించారు.

ఏ విదేశీయులపైనా దాడి చేయలేదు:- భారతదేశం & చైనా చారిత్రాత్మకంగా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్నాయని అజిత్ దోవల్ అన్నారు. 19వ శతాబ్దంలో జపాన్ పెరుగుదలను చూసి పశ్చిమ దేశాలను ఎందుకు ఆందోళనకు గురి అయ్యేయో ఆర్దంకావడంలేదన్నారు. దింతో జపాన్ పై ఆణు ప్రయోగం జరిగిందని గుర్తు చేశారు. మిగతా ప్రపంచం బలహీనంగా ఉన్నప్పుడు కూడా భారతదేశం ఏ విదేశీయులపైనా దాడి చేయలేదని,,ఆ సమయంలో మన భద్రతకు ఉన్న ముప్పులను అప్పటి నాయకులు అర్థం చేసుకోలేదన్నారు. కాబట్టి చరిత్ర మనకు ఒక పాఠం నేర్పిందని చెప్పారు. భారతదేశం అభివృద్ధి చెందిన సంస్కృతి, నాగరికత వున్నప్పటికి మనం ఎవరి ఆలయాలను ఎప్పుడూ ధ్వసం చేయలేదని గుర్తు చేశారు.

వలసవాదుల గుప్పిట్లో ఉన్నప్పుడు పుట్టాను:- సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలు, ధీరత్వంను వారసత్వంను ముందుకు తీసుకుని వెళ్లాలి అన్నారు.నేటి యువతరం అదృష్టవంతులు, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మీరు జన్మించారు. నేను భారతదేశం వలసవాదుల గుప్పిట్లో ఉన్నప్పుడు పుట్టాను’ అని అజిత్ డోభాల్ అన్నారు. భగత్‌సింగ్‌ను ఉరి తీశారని, సుభాష్ చంద్రబోస్‌ తన జీవితాంతం కష్టపడ్డారని, స్వాతంత్ర్య సముపార్జన కోసం ఎందరో త్యాగధనులు పోరాటాలు చేశారన్నారు. ప్రపంచంలో జరిగిన,జరుగుతున్న దాడులు, యుద్ధాలకు కొన్ని దేశాలు తమ ఇష్టారీతిగా బలప్రయోగానికి దిగడమే కారణమన్నారు.’మీరు శక్తిమంతులైతేనే స్వేచ్ఛగా జీవించవచ్చని అన్నారు. ఆత్మవిశ్వాసం లేకుండా ఎంత శక్తి ఉన్నా, ఆయుధ సంపత్తి ఉన్నా వృథా,,అయితే ఇందుకు భిన్నంగా నేడు అలాంటి గొప్ప నాయకులు మనకు ఉండటం మనం చేసుకున్న అదృష్టం’ అని డోభాల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పరోక్షంగాప్రస్తావిస్తూ ఆయన పట్టుదల, అంకితభావం, క్రమశిక్షణ మన అందరికీ స్ఫూర్తి అని డోభాల్ అన్నారు.

మన నాగరికతను అణిచివేశారు:- మనది ప్రగతిశీల సమాజమని, మనం ఇతరుల నాగరికత, ఆలయాలపై దాడులు చేయమన్నారు. భారతదేశంపై గతంలో జరిగిన దాడులను ప్రస్తావిస్తూ, ఈ దాడుల్లో లెక్కకుమించి ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, వేలాది ఆలయాలు ధ్వంసమయ్యాయని, గ్రామాలను దోచుకున్నారనీ, మన నాగరికతను అణిచివేశారని అన్నారు. చరిత్ర మనకు సవాళ్లు విసురుతోందన్నారు. అయితే ఇందుకు తగిన పట్టుదల నేటి యువతరంలో ఉందన్నారు. ప్రతీకారం అనేది మంచి పదం కానప్పటికీ, అది శక్తిమంతమైనదని అన్నారు. దేశం కోసం మనం ప్రతీకారం తీర్చుకోవాలి, అందుకోసం విలువలతో కూడిన సమున్నత భారతదేశాన్ని పునర్నిర్మించుకోవాలని దిశానిర్దేశం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *