పీఠపురంలో చెట్టు నుంచి ఆకు రాలిన,కొబ్బరి మట్ట ఉడి క్రింద పడిన-పవన్ కళ్యాణ్
అమరావతి: ప్రపంచంలో ఏ నియోజవర్గంలో ఈ స్థాయిలో వార్తల్లో వుండదు.పీఠపురంలో చెట్టు నుంచి ఆకు రాలిన,కొబ్బరి మట్ల ఉడి క్రింద పడిన,కొమ్మపైన కుర్చున్న పక్షి ఈక రాలిన అబ్బో పీఠపురంలో ఏదో దారుణం జరిగిపోతుంది అంటూ గందరగోళం సృష్టించేదుకు గత ప్రభుత్వ తాలుక నాయకులు ప్రయత్నిస్తునే వుంటారంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులకు చురకలు అంటించారు.శుక్రవారం పీఠపురంలో నిర్వహించిన సంక్రాంతి ముందస్తూ సంబరాల్లో అయన పాల్గొని మాట్లాడారు. త్వరంలోనే ఇంటిగ్రేటెడ్ మార్షల్ ఆర్ట్స్-ఫైన్ ఆర్ట్స్ అకాడమీ తన స్వంత ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చారు. తొలుత సభ ప్రాగణంలో ఏర్పాటు చేసిన సంప్రదాయ, జానపద కళాకారులు స్వాగతం పలకగా, వారితో కలసి కల్చరల్ వాక్ చేస్తూ ప్రాంగణానికి చేరుకున్నారు.

అంతకు ముందు కాకినాడలోని హెలీప్యాడ్ వద్ద పవన్ కళ్యాణ్ కి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ అపూర్వ తేజ్, పలువురు నాయకులు స్వాగతం పలికారు.
