కోల్‌కత్తాలోని ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలు
అమరావతి: దేశీయ ఎన్నికల్లో కీయ్రాశీలక పాత్ర పోషిస్తున్న కోల్‌కత్తాలోని ఐప్యాక్ కార్యాలయంలో, (ఈడీ) ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సోదాలు ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద జరుగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఐప్యాక్‌కు సంబంధించిన నిధుల లావాదేవీలపై అనుమానాలతోనే ఈ దాడులు జరిగినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.
పీఎంఎల్‌ఏ నిధులపై అనుమానాలు:- ఐప్యాక్‌కు, మనీలాండరింగ్ యాక్ట్ పరిధిలోకి వచ్చే నిధులు అందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కొన్ని లావాదేవీలు, ఫండింగ్ సోర్సులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సమాచారం. ఇప్పటి వరకు ఈడీ అధికారులు అధికారికంగా ఎలాంటి తుది ప్రకటన చేయలేదు. దర్యాప్తు కొనసాగుతోందని మాత్రమే పేర్కొన్నారు.

