రాష్ట్రంలో అభివృద్ది పేరిట జరుగుతున్నది అంతా స్కాంలే!-మాజీ సి.ఎం జగన్
లూలూ కంపెనీకి 14 ఎకరాల భూమి 99 ఏళ్లకు..
అమరాతి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఇష్యూ, భోగాపురం ఎయిర్‌పోర్టు, రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతిపై ఆర్బీఐ నివేదిక, పరిశ్రమల ప్రగతి పేరిట చేస్తున్న అవినీతి, అప్పుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, పన్నుల పేరిట బాదుడే బాదుడుతో పాటు, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ చంద్రబాబు అవినీతికి పాల్పపడుతున్నడంటూ మాజీ సి.ఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.గురువారం వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు: – దేశంలోనే ఇలాంటి చరిత్రహీనుడు ఎక్కడా ఉండి ఉండకపోవచ్చు. రాయలసీమ లిఫ్ట్ స్కీంపై చంద్రబాబు కానీ, ఆయన మంత్రి కానీ.. తెలంగాణ సీఎం మాటలు ఖండిస్తారనుకుంటే అది జరగలేదు.
రోజుకు 8 టీఎంసీలు నీరు తోడేలా తెలంగాణ ప్రాజెక్టులు:- పోతిరెడ్డిపాడు నుంచి మనకు దాదాపు 101 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. అయినా, గత 20 ఏళ్లలో కేవలం మూడు, నాలుగుసార్లు మాత్రమే, ఆ నీరు వచ్చింది. అలాంటి దుర్భరమైన పరిస్థితి ఇప్పటికే ఉండగా, మరోవైపు 2015లో ఇక్కడ చంద్రబాబు సీఎంగా ఉండగా, తెలంగాణలో కల్వకుర్తి లిఫ్ట్ కెపాసిటీని 25 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు పెంచి, శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే నీరు తోడేలా పని మొదలుపెట్టారు. రాష్ట్రంలో ప్రజలు నీళ్లు లేక జనం అల్లాడుతుంటే, తెలంలగాణలో లిఫ్ట్ లు, పవర్ హౌజ్ ద్వారా శ్రీశైలం నుంచి రోజుకు పలు మార్గాల్లో 8 టీఎంసీల నీరు తోడేసే పరిస్థితి. ఇక ఇక్కడ చూస్తే, తెలంగాణను అడ్డుకోలేని పరిస్థితి వుండేదన్నరు.
క్రెడిట్ చోరీకి చంద్రబాబు పాట్లు:– భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి క్రెడిట్ చోరీ కోసం చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నాడు. ఆయన నిజానికి ఆ ఎయిర్‌పోర్టు పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడికి ప్లాన్ చేశారు. మొదట ఆ ఎయిర్‌పోర్టుకు 15 వేల ఎకరాలు కావాలన్నారు. ఆ తర్వాత 5 వేల ఎకరాలు అన్నాడు. దీంతో ప్రజలంతా భయాందోళనకు గురై ఉద్యమ బాట పట్టారు. మేమూ వారితో గొంతు కలిపి, అధికారంలోకి వచ్చాక, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎయిర్‌పోర్టుతో పాటు, ఏరోసిటీ కూడా కలిపి 2,703 ఎకరాలతో బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టాం. అందుకోసం కోర్టుల్లో ఉన్న 130 కేసులు పరిష్కరించాం. 3 గ్రామాలో 400 కుటుంబాలు తరలించి, రూ.960 కోట్లతో భూసేకరణ జరిపాం. అవన్నీ చేసి, వేగంగా ఎయిర్‌పోర్టు పనులు కొనసాగించాం.
లూలూ కంపెనీకి 14 ఎకరాల భూమి 99 ఏళ్లకు-పరిశ్రమల పేరుతో అవినీతి:-పేరుకు ఒకటి, రెండు పెద్ద కంపెనీలకు ఉచితంగా భూమి ఇస్తున్నట్లు ప్రకటించి, ఆ ముసుగులో వేల కోట్ల విలువైన భూములను తన మనుషులు, తన బినామీలకు ఇచ్చేస్తాడు.విశాఖలో దాదాపు రూ.2 వేల కోట్ల విలువ చేసే 14 ఎకరాల భూమి 99 ఏళ్లకు లూలూ కంపెనీకి ఇచ్చారు. ఎలాంటి టెండర్, ఆక్షన్ లేకుండా కేవలం, ఆ కంపెనీ లెటర్ రాయగానే, మాల్ కట్టేందుకు ఆ భూమి ఇచ్చేశారు. అదే లూలూ గ్రూప్ రూ.519 కోట్లకు 16 ఎకరాలు అహ్మదాబాద్‌లో కొనుక్కుని మాల్ కడుతుంటే.. ఇక్కడ 14 ఎకరాల భూమి ఫ్రీగా ఇచ్చారు. గుజరాత్లో లూలూ కంపెనీ భూమి కొనుగోలుతో స్టాంప్ డ్యూటీ కింద రూ.31 కోట్లు ఆదాయం వచ్చిందని ఆ ప్రభుత్వం వెల్లడించింది.
ఆదాయం మొత్తం టీడీపీ నేతల జేబుల్లోకి:- రాష్ట్ర ఆదాయం దారుణంగా తగ్గుతోంది. ఎక్కడికక్కడ దోపిడి. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్›్జ.. దేన్నీ వదలడం లేదు. అన్నీ యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఆ మొత్తం టీడీపీ నేతల జేబుల్లోకి పోతోంది.అధిక ధరలకు పీపీఏలు చేస్తూ, కమిషన్లు దండుకుంటున్నారు.కింది నుంచి పైదాకా ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. అంత దారుణ వ్యవస్థను ఈ ప్రభుత్వం నడిపిస్తోంది.
మెడికల్ కాలేజీలకు టెండర్లు రాకపోవడం సంతోషకరం. మంచి విషయం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై న్యాయపోరాటం కూడా చేస్తున్నాం. నిన్ననే (జనవరి 7వ తేదీ) హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) కూడా వేశాం. దాన్ని కోర్టు కూడా ఆమోదించింది. ప్రభుత్వానికి సమన్లు పంపించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది ఈ దశాబ్దంలో అతి పెద్ద స్కామ్. కట్టిన కాలేజీలు ప్రైవేటుకి ఇవ్వడమే కాకుండా, రెండేళ్లు జీతాలు కూడా ఇవ్వడం స్కామ్ కాక మరేమిటి?..

