జన,కుల గణననకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
అమరావతి: దేశవ్యాప్తంగా 2026 జనగణననకు కేంద్ర కేంద్ర హోం శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై 30 సెప్టెంబర్ తో తొలి దశ ప్రక్రియ ముగుస్తుంది. దేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో కనీసం 30 రోజులపాటు ఈ ప్రక్రియను నిర్వహించనుంది. అన్ని రకాల ఇళ్లు,జనవాసాలు, భవనాలు, నిర్మాణాల వివరాలను సేకరించనున్నారు. రెండో దశలో జనాభా లెక్కల సేకరణ 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. జనాభా లెక్కలను పూర్తిగా డిజిటల్ రూపంలో చేపట్టనున్నారు. జనగణనతోపాటే కులగణనను సైతం పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది.

