తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగించ వచ్చు-హైకోర్టు
అమరావతి: తొలి నుంచి సనాతధర్మంను అనుసరించే వారికి పలు అడ్డంకులు,అంక్షలు సృష్టించే తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి చెంపదెబ్బ తగిలింది. మధురైలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభంపై దీపం వెలిగించ వచ్చు అంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నేడు మద్రాస్ హైకోర్టు (మధురై బెంచ్) సమర్ధించింది. 2025 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ స్తంభంపై దీపం వెలిగించేందుకు భక్తులు ప్రయత్నించగా,,స్టాలిన్ ప్రభుత్వం అడ్డుకుంది. అక్కడ దీపం వెలిగించడానికి వీల్లేదని ఆదేశించింది. పక్కనే దర్గా ఉండటం వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం కుంటుసాకు చెప్పింది.
కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం:- అలాగే స్తంభంపై దీపం వెలిగించకూడదని శాస్త్రాల్లో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రామ రవికుమార్ తో సహా పలువురు 2025 డిసెంబర్ 1వ తేదిన మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతించాలని కోరారు. దీనిపై స్పందించిన సింగిల్ జడ్జి,, దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం,,దర్గా కమిటీ,, వక్ఫ్ బోర్డులు, మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేయాలని కోరారు. దీప స్తంభం ఉన్న దేవాలయం దర్గాకు చెందినదని, ఇక్కడ దీపం వెలిగించకూడదని శాస్త్రంలో ఉందని, అలాగే దీపం వెలిగించడం వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ జి.జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్ లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది.
ఇబ్బంది కలిగితే ప్రభుత్వమే కారణం:- సంవత్సరంలో ఒక రోజు దీపం వెలిగించినంత మాత్రాన శాంతి భద్రతల సమస్య తలెత్తవని అభిప్రాయపడింది. అలాగే దీపం వెలిగించ వద్దని శాస్త్రాల్లో ఉన్నది అనేందుకు తగిన ఆధారాల్ని కోర్టుకు సమర్పించలేదని పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వ రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ అక్కడ ఇబ్బంది కలిగితే,,అందుకు ప్రభుత్వమే కారణం అయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వం అలా దిగజారబోదని భావిస్తున్నట్లు తెలిపింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై తమిళనాడు బీజేపీ నేత అన్నామలై హర్షం వ్యక్తం చేశారు.

