NATIONALOTHERSWORLD

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి

అమరావతి: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (BNP) చైర్‌పర్సన్ ఖలీదా జియా (80), దీర్ఘకాలిక అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో మరణించారని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వెల్లడించింది.36 రోజులుగా ఖలీదా జియా గుండె, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, న్యూమోనియా తదితర సమస్యలతో ఢాకాలోని ఎవర్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలేయ, డయాబెటిఱ్లస్, అర్థరైటిస్, కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉన్నాయి.విదేశాలకు తరలించి చికిత్స అందించాలని ప్రయత్నించారు. కానీ ఖలీదా జియా ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించడంతో నేడు తుదిశ్వాస విడిచారు.1991-96, 2001-2006 మధ్య పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు. బంగ్లాదేశ్‌లో కేర్ టేకర్ గవర్నమెంట్ వ్యవస్థతో పాటు పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. అవినీతి కేసులో 2018 నుంచి 2020 వరకు జైలులో గడిపారు. ఖలీదా జియా పెద్ద కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత ఇటీవలే బంగ్లాదేశ్‌కు తిరిగొచ్చాడు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *