శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న తెలంగాణ సీ.ఎం రేవంత్ రెడ్డి
తిరుపతి: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాదు నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన సీ.ఎం రేవంత్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్,, అచ్చం నాయుడు తిరుమలకి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఈవో, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళి, టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి తదితరులు ఉన్నారు.

