నారాయణ హాస్పిటల్ ఆన్ విల్స్ వాహనం ద్వారా నిరుపేదలకు ఉచితంగా వైద్యం
44వ డివిజన్..
నెల్లూరు: ప్రజల ఇంటి వద్దకే వైద్యం అందించాలన్న మంచి ఉద్దేశంతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు.నారాయణ హాస్పిటల్ ఆన్ విల్స్ వాహనం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని 44వ డివిజన్ అధ్యక్షుడు ఏడుకొండలు,జిల్లా అధికారప్రతినిధి హరికృష్ణ,మాజీ కార్పొరేటర్ పిట్టి.సత్యనాగేశ్వర్లు తెలిపారు.సోమవారం నగరంలోని 44వ డివిజన్లోని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ వాహనం ద్వారా పేద ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు, అత్యాధునిక వైద్య పరికరాలు, అనుభవం ఉన్న వైద్యులతో చికిత్స అందించరని తెలిపారు.అవసరమైతే మెరుగైన వైద్యం కోసం నారాయణ ఆస్పత్రిలో ఉచిత వైధ్య సేవలకు సిఫార్సు చేస్తున్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నేతలు పాతపాటి అశోక్, యానాదిరెడ్డి, జఫ్రుల్లా, యూసుఫ్, నిమ్మకాయల సతీష్,మహేష్, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

