జలాంతర్గామిలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అమరావతి: దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల కమాండర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అదివారం సబ్‌మెరైన్‌లో సాహస ప్రయాణం చేశారు. రెండు నెలల క్రిందట రఫేల్ యుద్ధ విమానంలో గగనవిహారం చేసిన రాష్ట్రపతి, ఈసారి సాగరలోతుల్లో ప్రయాణించారు. కర్నాటకలోని కార్వార్ నేవీ బేస్‌కి వెళ్లి అక్కడి నుంచి INS వాఘ్‌షీర్‌లో ప్రయాణించారు. రాష్ట్రపతి వెంట చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి కూడా ఉన్నారు. ఈ కల్వరి క్లాస్ సబ్‌మెరైన్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. జలాంతర్గామిలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు. గతంలో అబ్దుల్ కలాం సబ్‌మెరైన్‌లో ప్రయాణిస్తే,నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము INS వాఘ్‌షీర్‌లో పయనించారు.

