మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ హతం-డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా
అమరావతి: ఒడిశాలోని గంజాం జిల్లా సరిహద్దు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా, వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ కూడా హతమైనట్లు ప్రకటించారు.2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలిస్తామని అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ఒడిశాను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారుస్తామన్నారు. గురువారం నాడు ఒడిశాలోని కంధమాల్ జిల్లాలోని గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉనికి ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందిన వెంటనే ఆప్రమత్తమైన పోలీసులు, ప్రత్యేక బలగాలు కూంబింగ్ చేపట్టాయని ఒడిశా డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా తెలిపారు. అక్కడ జరిగిన ఎన్ కౌంటర్ లో ఒడిశాలో మావోయిస్టు ఉగ్రవాదం వెన్నెముక(గణేష్) విరిగిపోయిందని దింతో రాష్ట్రంలో మావోయిస్టు ఆలోచనల్లో పెను మార్పును తీసుకువస్తుందని వ్యాఖ్యనించారు.
గణేష్‌పై రూ.1.10 కోట్ల రివార్డు:- ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు అక్కడికక్కడే చనిపోయారని,, మావోయిస్టుల వద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గణేష్ స్వస్థలం నల్లగొండ జిల్లాలోని చండూర్.గణేష్‌పై రూ.1.10 కోట్ల రివార్డు ఉంది. గణేశ్ గత 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో వివిధ హోదాల్లో పనిచేశాడు.

