కరెంటోళ్ల జనబాట పోస్టర్లు, యాప్ను ఆవిష్కరించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల
వేగంగా పరిష్కారాలు-రాఘవేంద్రం..
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL) ఆధ్వర్యంలో రూపొందించిన “ కరెంటోళ్ళ జనబాట” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు,యాప్ను సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆవిష్కరించడం జరిగిందని విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ కె.రాఘవేంద్రం ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రామాలు, పట్టణాల్లో క్షేత్రస్థాయిలో:- వినియోగదారుల సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలులోకి తీసుకువచ్చారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నేరుగా గ్రామాలు, పట్టణ వార్డుల్లో పర్యటించి వినియోగదారుల సమస్యలను పరిష్కారిస్తారు.
మంగళవారం,శుక్రవారాలు:- ప్రతి మంగళవారం-శుక్రవారం క్రింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు నిర్దేశిత గ్రామాల్లో పర్యటనలు నిర్వహిస్తారు.
విద్యుత్ లైన్లు తనిఖీలు:- 11 కేవీ, ఎల్టీ, వ్యవసాయ విద్యుత్ లైన్లను విద్యుత్ భద్రత దృష్ట వాలిపోయే స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభాలు గుర్తించి,మారుస్తారు. క్రిందకు వేలాడుతున్న తీగలు, వాలిపోయిన స్తంభాలు, ప్రమాదకర ట్రాన్స్ ఫార్మర్లను గుర్తించి మరమ్మతులు చేయాలని, అవసరమైన చోట ట్రాన్స్ ఫార్మర్ దిమ్మెల ఎత్తులు పెంచాలని లేదా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
నిరంతర,నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యం:- క్షేత్రస్థాయిలో సమస్యల గుర్తించడం ద్వారా వినియోగదారులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు విద్యుత్ నష్టాలను అరికట్టడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అధికారులు తెలిపారు.
పునరుత్పాదక శక్తి, స్మార్ట్ మీటర్లు:- గ్రూప్ ఆఫ్ సోలార్ ప్లాంట్లకు ప్రోత్సాహం, స్మార్ట్ మీటర్లపై వినియోగదారులకు అవగాహన కల్పించడం,స్మార్ట్ మీటర్లు పై ఉన్న అనుమానాలను నివృత్తి చేయడం.
డయల్ యువర్ సీఎండీ,ఎస్.ఈ:- ప్రతి సోమవారం తిరుపతిలో నిర్వహిస్తున్న డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం, అలాగే జిల్లాలో ప్రతి సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు నిర్వహించే డయల్ యువర్ ఎస్.ఈ. కార్యక్రమం ద్వారా వినియోగదారుల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు బాల చంద్ర, శ్రీధర్, లక్ష్మీ నారాయణ,పరందామయ్య, బెనర్జీ, భాను నాయక్, డిఈఈ మునీంద్ర,విద్యుత్ శాఖ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

