షార్ నుంచి 24న LVM3 M6 రాకెట్ ప్రయోగం
అమరావతి: తిరుపతి జిల్లా శ్రీహరి కోట నుంచి (బుధవారం) 24వ తేదీన LVM3 M6 రాకెట్ ప్రయోగానికి వేదిక సిద్దం అయింది. 24వ తేదిన ఉదయం 8:54 నిమిషాలకి LVM3 M6 ద్వారా అమెరికాకు చెందిన బ్లూ బార్డ్ బ్లాక్-2 శాటిలైట్‌ని నింగిలోకి మోసుకెళ్లనుంది.. శాటిలైట్ బరువు 6100 కిలోలు ఉంటుంది..ఈ శాటిలైట్‌ని అమెరికాకి చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించింది..గతంలో పంపిన శాటిలైట్ల కంటే పదిరెట్లు అధిక సామర్థ్యంతో Blue Bird Block-2 శాటిలైట్ పనిచేయనుంది..LVM3 M6 రాకెట్ ఎత్తు-43.5 మీటర్లు, బరువు 640 కేజీలు వుంటుంది..ఈ రాకెట్ ప్రయోగ సమయం 15నిమిషాల 7 సెకన్లు ఉండనున్నది.. బుధవారం ప్రయోగం జరుగనున్న నేపథ్యంలో షార్కి ఇస్రో చైరన్ డాక్టర్ నారాయణన్,, AST స్పేస్ మొబైల్ సంస్థ ప్రతినిధులు చేరుకున్నారు..LVM3 M6 ప్రయోగం పూర్తి వాణిజ్య ప్రయోగంగా తెలుస్తోంది.. వాణిజ్య ప్రయోగాలతో దూసుకుని వెళ్లుతున్న షార్,,మరిన్ని వ్యాణిజ్య శాటిలైట్ ప్రయోగాలు జరిపే అవకాశాలు ఉన్నాయి.

