జిన్నా కోసం నెహ్రూ వందేమాతరం గీతాన్ని ముక్కలు చేశారు-ప్రధాని మోదీ
కాంగ్రెస్,,నెహ్రూల కుటుంబాలు, కుటిల రాజకీయం కోసం దేశాన్నే పణంగా పెట్టారు. కాంగ్రెస్ నీచమైన బుధ్దిని నేటి యువతరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతనైన వుంది.
అమరావతి: వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా సోమవారం లోక్సభలో ఆ అంశంపై సుధీర్ఘ చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తూ,, మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. జాతీయ గేయం వందేమాతరాన్ని కాంగ్రెస్ ముక్కలు ముక్కలు చేసిందని,, ఎందుకంటే ముస్లింలను రెచ్చగొడుతుందన్న ఉద్దేశంతో ఆ గేయాన్ని ముక్కలు చేశారని మోదీ మండిపడ్డారు.లోక్సభలో ప్రధాని మోదీ ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో అధికార పార్టీ సభ్యులు సిగ్గు సిగ్గు అంటూ అరిచారు. గడిచిన శతాబ్ధంలో కొన్ని శక్తులు జాతీయ గేయం పట్ల దారుణానికి పాల్పడినట్లు ప్రధాని అన్నారు.
నెహ్రూకు, సుభాష్ చంద్ర బోస్ లేఖ:- జాతీయ గేయాన్ని ముక్కలు చేసిందెవరన్న విషయాన్ని రాబోయే తరాలకు తెలియచేయాల్సి అవసరం వుందన్నారు. మొహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ 1937లో వందేమాతరం గేయానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిందని,,అయితే కాంగ్రెస్ పార్టీ,, నెహ్రూ సదరు ఉద్యమాన్ని వ్యతిరేకించకుండా, వందేమాతరం గీతాన్ని ముక్కలు చేశారని విమర్శఇంచారు.వందేమాతరాన్ని జిన్నా వ్యతిరేకించిన తర్వాత నెహ్రూకు, సుభాష్ చంద్ర బోస్ లేఖ రాశారని, ఇందుకు సమాధానంగా వందేమాతరం గేయం ముస్లింలను చిరాకు పరిచే వుందని,అందుకే వ్యతిరేకించ లేదని నెహ్రూ పేర్కొన్నారన్నారు. ఎమర్జెన్సీ పాలన సమయంలోనూ వందేమాతరం గీతానికి వందేళ్లు నిండాయని, అదే సమయంలో రాజ్యాంగం తీవ్ర అణిచివేతకు గురైందన్నారు.
హిందూ దేవతల ప్రస్తావన ముస్లింలకు:- బెంగాలీ రచయిత బంకిమ్ చంద్ర ఛటర్జీ 1875లో వందేమాతరం గీతాన్ని రాశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో ఆ గీతం కీలక పాత్ర పోషించింది. వందేమాతరం గీతంలో తొలి రెండు చరణాలు మాత్రమే వాడాలని 1937లో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గేయంలో ఉన్న హిందూ దేవతల ప్రస్తావన ముస్లింలకు నచ్చడం లేదని,, అందుకే పూర్తి గేయాన్ని పూర్తిగా పాడవద్దు అని అప్పట్లో నెహ్రూ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అన్ని జాతీయ సమావేశాల్లో కేవలం తొలి రెండు చరణాలను మాత్రమే పాడడం మొదలుపెట్టారు. వందేమాతరం గీతంతో విభజన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ,అప్పటికే దేశవిభజనకు బీజం వేసిందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
వందేమాతం గీతంలో దుర్గామాతపై ఉన్న చరణాలను నెహ్రూ కావాలని తొలగించినట్లు ఇటీవల బీజేపీ ప్రతినిధి సీఆర్ కేశవన్ ఆరోపించారు. 1937లో నెహ్రూకు నేతాజీ రాసిన లేఖలను ఆయన తన ఎక్స్ లో తాజాగా పోస్టు చేశారు.

