సిటీ బస్సు డ్రైవర్,కండక్టర్లపై కత్తులతో దాడి?
నగర ప్రజలకు రక్షణ వుందా?
రౌడీ షీటర్లను నగర డిస్పీ రోడ్డుపై నడిపించిన,,ఎస్పీ కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించిన నగర ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది.ఇటివలే పెంచటయ్య అనే యువకుడిని దారుణంగా హత్య చేసుకున్న సంఘటన నగరంలో చోటు చేసుకుంది.ఇలాంటి సంఘటనలు నగరంలో ఎక్కడో ఒక చోట జరుగుతునే వున్నాయి. ఇందుకు ప్రధాన కారణంగా ఇలాంటి వారు ఎదో ఒక రాజకీయ పార్టీలోని నాయకుల అండతో యధేచ్చగా తిరుగుతున్నారన్న విమర్శలు వున్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఘతం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి పోలీసులకు అదేశాలు ఇచ్చిన ఇలాంటి సంఘటన ఎందుకు చోటు చేసుకుంటున్నయన్న ప్రశ్నలు ముఖ్యంగ నగర వాసుల నుంచి వస్తొంది.మరి దినికి సమాధానం ఎవరి నుంచి వస్తుంది??
నెల్లూరు: నగరంలో అదివారం దారుణం చోటు చేసుకుంది.ఆత్మకూరు బస్టాండ్ దగ్గరలోని నక్కలోళ్ల సెంటర్ వద్ద సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై దుండగులు మారణాయుధాలతో దాడి చేసి, డ్రైవర్ మన్సూర్ గొంతు కోశారు. అలాగే బస్సు కండక్టర్ సలీమ్‌పై దాడి చేశారు.వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి,,డ్రైవర్,కండక్టర్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మన్సూర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు,,ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్న కండక్టర్ నుంచి వివరాలు సేకరించారు.ఈ సంఘట చోటు చేసుకునే ముందు,,రోడ్డుపై బైక్ అడ్డంగా నిలిపిన బైక్ ను పక్కకు తీయాలంటూ యువకులకు బస్సు డ్రైవర్ కోరాడు. దింతో రెచ్చిపోయిన యువకులు, బస్సు డ్రైవర్‌తో తగాదకు దిగారు. డ్రైవర్‌కు మద్దతుగా కండక్టర్ మాట్లాడాడు.దింతో రెచ్చిపోయిన వాళ్లు,, డ్రైవర్, కండక్టర్‌పై మారణాయుధాలతో దాడి చేసి,,అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటనపై 3 టౌన్ (సంతపేట) పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

