గోవాలో 77 అడుగుల ఎత్తైన రాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రదాని మోదీ
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగలి జీవోత్తమ మఠంలో మఠం 550వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన “సార్ధ పంచశతమానోత్సవ్” వేడుకల సందర్భంగా వగ్రహ అవిష్కరణ కార్యక్రమం జరిగింది. రామాయణ థీమ్ పార్క్ గార్డెన్‌ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక తపాలా బిళ్ళ, స్మారక నాణెంను విడుదల చేశారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ గోవాను హాలిడే లేదా పిక్నిక్ గమ్యస్థానంగా బావిస్తారు కానీ ఈ ప్రాంతం సాంస్కృతికంగా ముఖ్యమైన ప్రదేశం అన్నారు. ఆసియాలోనే ఎత్తైన రాముడి కాంస్య విగ్రహాన్నిఆవిష్కరించడం తన జన్మసుకృతంగా బావిస్తున్నాని అన్నారు.ప్రపంచంలో ఎక్కడా అలాంటి విగ్రహం లేదు. మన సంస్కృతి గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుందన్నారు.

