NATIONAL

ఆధార్‌ కార్డు ఉన్నంత మాత్రాన ఈ దేశ పౌరుడు కాని వారికి ఓటు హక్కు ఇవ్వాలా? సుప్రీం

అమరావతి: దేశంలోకి అక్రమంగా చొరబడిన వారు ఆధార్‌ కార్డులు పొందటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ,, ఆధార్‌ కార్డు కలిగిఉన్నంత మాత్రాన ఈ దేశ పౌరుడు కాని వారికి ఓటు హక్కు ఇవ్వాలా? అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడానికి మాత్రమే అధార్‌ పనికి వస్తుందని,, ఆధార్‌ కార్డు దేశ పౌరసత్వానికి సరైన రుజువు కాదని స్పష్టం చేసింది.. పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలనే ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారిస్తోంది. అధార్‌ చట్టం దేశ పౌరసత్వాన్ని కానీ,, నివవాస స్థలాన్ని కానీ ఇవ్వదని బెంచ్‌ స్పష్టం చేసింది. అలాగే ఓటును హక్కును తొలగించే ముందు నోటీసు ఇవ్వాలని కోర్టు సూచించింది..ఎవరైనా ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు కోసం దరఖాస్తుతోపాటు సమర్పించిన దృవపత్రాల అధారంగా ఓటు హక్కు ఇవ్వాల వద్దా అని నిర్ణయించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంటుందని స్పష్టం చేసింది. ఎలక్షన్‌ కమిషన్‌ పోస్టాఫీసు కాదని పేర్కొంది.. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో SIRని ప్రత్యేకంగా సవాలు చేస్తున్న ధాఖలైన పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు షెడ్యూల్‌ను నిర్ణయించింది.. డిసెంబర్ 1వ తేది లోగా ప్రతిస్పందనలను దాఖలు చేయాలని బెంచ్ ఎన్నికల కమిషన్‌ను కోరింది.. పిటిషనర్లు తమ వాదనలను దాఖలు చేయవచ్చని, త్వరలోనే ఈ విషయాలు విచారణకు వస్తాయని తెలిపింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *