బీహార్ ముఖ్యమంత్రిగా 10వ సారి జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం
అమరావతి: బీహార్ రాష్ట్రానికి 10వ సారి ముఖ్యమంత్రిగా JDU అధినేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. బుధవారం ఎన్డీయేకు చెందిన 202 మంది ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 3.30 గంటలకు పాట్నాలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నితీశ్‌ను ఎన్డీయే నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పాట్నాలోని గాంధీ మైదానంలో గురువారం మధ్యాహ్నం 11.30 గంటలకు నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఉప ముఖ్యమంత్రులుగా బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా తిరిగి కొనసాగనున్నారు.

