AP&TG

టెక్స్ టైల్స్’ లో రూ.4,380 కోట్ల పెట్టుబడులు

కుదిరిన 7 ఎంవోయూలు….

విశాఖపట్నం: విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో టెక్స్ టైల్స్ రంగంలో రూ.4,380.38 కోట్ల మేర ఏడు ఎంవోయూలు జరిగాయి. ఈ ఒప్పందాలతో ప్రత్యక్షంగా 6,100 ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖ సమ్మిట్ లో శనివారం మంత్రి సవిత సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. టెక్నికల్ టెక్స్‌టైల్స్, రీసైక్లింగ్, గార్మెంట్స్, సిల్క్, అప్పారెల్స్ రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టడానికి ఇన్విస్టర్స్ ఆసక్తి చూపారు. విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు, శ్రీ సత్యసాయి, అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. కామధేను సటికా సంస్థ రూ.90 కోట్లతో కృష్ణీ జిల్లా మచిలీపట్నంలో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిశ్రమతో 650 మందికి ఉద్యోగాలు రానున్నాయి. చిత్తూరు జిల్లా గండ్రాజుపల్లిలో జీనియస్ ఫిల్టర్స్ సంస్థ రూ.120 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ వల్ల ప్రత్యక్షంగా 250 మందికి ఉపాధి లభించనుంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో అరవింద్ అపెరల్ పార్క్ రూ.20 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ ఏర్పాటుతో రెండు వేల ఉద్యోగాలు రానున్నాయి. గుంటూరులో వామిని ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.35 కోట్లు మేర పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థతో గుంటూరులో రెండు వేల మందికి ఉపాధి లభించనుంది. విశాఖపట్నంలో ఎంవీఆర్ టెక్స్ టైల్స్ రూ.105.38 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థ యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ సంస్థ ఏర్పాటుతో 900ల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అనకాపల్లిలో బీసీయూబీఈ టెక్స్ టైల్స్ యాజమాన్యం రూ.10 కోట్ల పెట్టుబడులు పెట్టంది. ఈ సంస్థ వందమందికి ఉపాధి కల్పించనుంది.

సీఎం చంద్రబాబు సమక్షంలో రూ.4 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం:- ఫిన్లాండ్ కు చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ ఏపీలో రూ. 4వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, మంత్రి సవిత సమక్షంలో ప్రభుత్వంతో ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. టెక్స్‌టైల్ రీసైక్లింగ్ టెక్నాలజీని ఈ సంస్థ భారత్‌ కు తొలిసారి తీసుకువస్తోంది. మొత్తం ఏడు ఒప్పందాల ద్వారా ఏపీ టెక్స్ టైల్స్ రంగంలో రూ. రూ.4,380.38 కోట్ల మేర పెట్టుడులు తరలొచ్చాయి. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 6,100 ఉద్యోగాలు రానున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *