ఆసిఫ్ మునీర్ కోసం 27వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చిన పాకిస్తాన్ ప్రభుత్వం
కొత్త ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్టు..
అమరావతి: పాకిస్తాన్ కీలుబొమ్మ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్,, ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌కు అపరిమిత అధికారాలు కట్టబెట్టేలా రాజ్యాంగ సవరణకు సిద్ధమైంది..దింతో షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆదివారం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు దిగాయి.. ప్రభుత్వ చర్యలతో రాజ్యాంగ పునాదులు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించాయి.. రాజ్యాంగబద్ధ వ్యవస్థల అధికారాలు, రక్షణలను సమూలంగా మార్చేలా పాకిస్తాన్ ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చింది.. దేశంలోని అత్యున్నత న్యాయవ్యవస్థగా ఉన్న సుప్రీంకోర్టు నుంచి కీలక అధికారాలను బదిలీ చేస్తూ కొత్త ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్టు (FCC) ఏర్పాటు చేశారు.. ఈ మార్పు సుప్రీంకోర్టు అధికారాలను పరిమితం చేస్తుంది..సవరణ మేరకు… సైన్యం, నావికాదళం, ఎయిర్‌ఫోర్స్ కు అధిపతిగా ఆర్మీ చీఫ్‌ను నియమించేలా ప్రత్యేక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ (CDF) పదవిని ఏర్పాటు చేయనున్నారు.. ఫీల్డ్ మార్షల్ స్థాయి అధికారికి ఈ పదివిని కేటాయిస్తారు..పార్లమెంటు ఆమోదం అనంతరం ప్రస్తుత ఫీల్డ్ మార్షల్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్,,, నేవీ, ఎయిర్‌ఫోర్స్ కు కూడా అధిపతిగా వ్యవహరిస్తారు.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ గా విధులు నిర్వహించిన వారిపై పదవీ విరమణ తరువాత ఎలాంటి దర్యాప్తూ చేపట్టకుండా జీవితకాల రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది..ఈ సవరణపై పాక్‌లో ప్రతిపక్షాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి..
‘ఈ ముసాయిదా సవరణ చట్టంగా మారితే ఫీల్డ్ మార్షల్ మునీర్‌కు జీవితకాల రక్షణ లభిస్తుంది.. ఆయనపై ఎలాంటి కేసులు పెట్టేందుకు ఎలాంటి అవకాశం ఉండదు.. ఎన్నో తప్పులు చేసి భయపడిపోతున్న ఆసిమ్ మునీర్ తన చుట్టూ తానే ఓ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.. దేశానికి అన్యాయం చేసినందుకు దోషిగా నిలబడాల్సి వస్తుందని భయపడుతున్నారు.. పీటీఐ పార్టీ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ ఆసిమ్ మునీర్ తప్పులను నుంచి తప్పించుకునేందుకు జీవితకాల రక్షణను ఏర్పాటు చేసుకుంటున్నారు’ అని మండిపడ్డారు.

