సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 24న బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ సూర్యకాంత్?
అమరావతి: భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 24వ తేదిన జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు..ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్,, తదుపరి CJI గా జస్టిస్ సూర్యకాంత్ పేరును న్యాయ శాఖకి సిఫార్సు చేసారు..ప్రస్తుత సీజేఐ BR గవాయ్ నవంబర్ 23వ తేదిన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్‌ను CJIగా సిఫార్సు చేస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.. జస్టిస్ సూర్యకాంత్ ఫిబ్రవరి 9, 2027 వరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయనున్నారు.

