ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్ స్టేషన్‌గా మార్పు
అమరావతి: ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్ స్టేషన్‌గా మారుస్తూ సెంట్రల్ రైల్వే నిర్ణయం ప్రకటించింది.మహారాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 15న ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును మార్చడానికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలోని నాందేడ్ డివిజన్ పరిధిలోకి ఉంటుంది.
శంభాజీ మహారాజ్‌కు నివాళిగా:- 2023లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం ఔరంగాబాద్ నగరాన్ని అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్‌గా పేరు మార్చి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్‌కు నివాళిగా ఔరంగాబాద్ నగరం మార్పు చేసినట్లు ప్రకటించింది. ఔరంగాబాద్ నగరం పేరు మార్పు తరువాత 3 సంవత్సరాలకు,,శనివారం సెంట్రల్ రైల్వే ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌ను అధికారికంగా “ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్” గా పేరు మార్చింది.అలాగే అన్ లైన్ లో కొత్త స్టేషన్ కోడ్ ‘CPSN’ అని సెంట్రల్ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

