AP&TGCRIME

కర్నూలు జిల్లా వద్ద కావేరి ట్రావెల్స్ లో ఘోర అగ్రి ప్రమాదం-28 మంది సజీవదహనం?

అమరావతి కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం వేకువజామున 3.30 గంల ప్రాంతంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో దాదాపు 28 మంది ప్రయాణికులు సజీవదహనం అయినట్లు తెలుస్తొంది.? గురువారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్స్‌ సెమీ సిప్లర్ ప్రైవేటు బస్సు (DD09 N9490)  చిన్నటేకూరు వద్ద రాంగ్ రూట్ లో  వచ్చిన బైక్‌ను ఢీకొట్టింది.బైక్ ను ఢీకొట్టిన వెంటనే బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లోనే మంటలు ఇంజిన్‌ నుంచి మొత్తం బస్సులో వ్యాపించాయి. ఇంధన ట్యాంక్‌ పేలడంతో మంటలు మరింత వేగంగా వ్యాపించాయి.

త్రుటిలో తప్పించుకున్న 12 మంది:- బైక్‌ను ఢీకొట్టడంతో ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో నిద్రలో వున్న పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయి సజీవదహనమయ్యారు.ప్రయాణికుల్లో దాదాపు 12 మంది ఆప్రమత్తం కావడంతో వారు ఎమర్జీని డోర్ ను పగుల కొట్టి బయటకు దూకేశారు. వీరిలో సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్‌, అఖిల్‌, హారిక, జష్మిత, అకీర, రమేష్‌, జయసూర్య, సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. వీరికి స్వల్ప గాయాలు కావడంతో సమీప ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఒక వైపు వర్షం కురుస్తున్నప్పటికి మంటలు అదుపులోకి రాక పోవడం దురదృష్టం.జిల్లా కలెక్టర్,,ఎస్పీ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలకుం చేరుకున్పప్పటికి దారుణం జరిగిపోయింది.కర్నూల్-బెంగుళూరు రహదారిపై ఇతర వాహనాలు నిలిచిపోవడంతో నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

సీఎం చంద్రబాబు,,తెలంగాణ సీ.ఎం రేవంత్ రెడ్డిలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని రకాల సహయం తో పాటు మెరుగైన వైద్యం అందించాలని అదేశించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *