12 గంటల్లోపు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి,దక్షిణకోస్తా తీరాల వైపు
అమరావతి: బంగాళాఖాతంలోని తీవ్రఅల్పపీడనం రాబోయే 12 గంటల్లోపు వాయుగుండంగా బలపడనున్న నేపధ్యంలో ప్రభుత్వ యంత్రాంగం హై అలెర్ట్ ప్రకటించింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి,దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ మరింత బలపడే అవకాశం వుందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని సూచించారు.
హోం మంత్రి:- దక్షిణకోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాల నేపధ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో బుధవారం హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. సహయక చర్యలకు NDRF, SDRF, పోలిస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ 24/7 అలెర్ట్ గా ఉండాలని,,ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక మెసేజ్లు పంపాలని,,సహయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలని కోరారు.

