పొదలకూరు రోడ్డు, రంగనాయకుల పేట ఇళ్లు, దుకాణాలు తొలగింపు
నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో స్థానిక పొదలకూరు రోడ్డు ప్రాంతంలో రోడ్లను ఆక్రమించి నిర్మించిన ఇండ్లు, దుకాణాలను శుక్రవారం తొలగించారు. అదేవిధంగా స్థానిక రంగనాయకుల పేట పినాకిని పార్క్ వెళ్ళే మార్గంలో రోడ్డు విస్తరణ లో భాగంగా నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది తొలగించారు. అనుమతులు లేని నిర్మాణాలను, డ్రైను కాలువలను, రోడ్లను ఆక్రమిస్తూ ఏర్పాటుచేసిన ఇండ్లు, దుకాణాలను తప్పనిసరిగా తొలగించి వేస్తామని కమిషనర్ హెచ్చరించారు.

