మావోయిస్ట్ చరిత్రలోనే అతి పెద్ద లొంగుబాటు-208 మందితో ఆశన్న
అమరావతి: మావోయిస్ట్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతొంది..మావోయిస్టుల సిద్దాంతల పట్ల ప్రజల నుంచి విముఖత వ్యక్తం అవుతున్న నేపధ్యంలో జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు సిద్ధమౌవుతున్నారు.. కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్ అలియాస్ ఆశన్న అలియాస్ తక్కళ్లపల్లి వాసుదేవరావు దండకారణ్యం విడిచి జనవాసాల్లోకి వచ్చాడు. శుక్రవారం తన అనుచరులతో కలిసి వాసుదేవరావు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, హోంమంత్రి సమక్షంలో తన అనుచరులతో శుక్రవారం జగదల్పూర్లో లొంగిపోయారు. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సమక్షంలో మావోయిస్టులు మొత్తం 153 అయుధాలను అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది..ఏకె-17లు 19,,,ఇనాస్స్ రైఫిళ్లు-23,,,కార్బన్స్-4,,,303 రైఫిళ్లు-36…12 బోర్ గన్స్-41….బీజిఎల్ లాంచర్లు-11….పిస్టల్-1..వున్నాయి..

