నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్దన్ రావు సంచలన ప్రకటన
అమరావతి: రాష్ట్రంలో నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్దన్ రావు సంచలన విషయాలు వీడియో ద్వారా వెల్లడించారు.వైసీపీ పాలనలో జోగి రమేశ్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ చేసినట్టు చెప్పారు. కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశామన్నారు.ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో జోగి రమేశ్ తనకు కాల్ చేసి, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచేందుకు మళ్లీ నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టాలని జోగి రమేశ్ తనతో అన్నారని చెప్పారు.
తంబళ్లపల్లె నియోజకవర్గంలో:- “పై వారి ఆదేశాలతోనే నాకు నమ్మకస్తుడు అయిన నీకు ఈ పని అప్పగిస్తూన్నా” అని అన్నారని తెలిపారు. నువ్వు అయితేనే ఈ పని చేయగలవు అని జోగి రమేశ్ నాతో అన్నారని వెల్లడించారు.తొలుత ఇబ్రహీంపట్నంలో మద్యం తయారీ మొదలు పెట్టాలనుకున్నప్పటికి జోగి రమేశ్ ఆదేశాలతో తంబళ్లపల్లె నియోజకవర్గంలో తయారీ ప్రారంబించామన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో లిక్కర్ షాపులు నేను తీసుకున్నా,, తంబళ్లపల్లె నుంచి ప్రారంభిస్తే చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లొచ్చని, అది అడ్వాంటేజ్ అవుతుంది అని జోగి రమేశ్ అన్నారని తెలిపారు.
డిపార్ట్మెంట్ కు లీకులు ఇచ్చి:- వేరే వాళ్ల పేరు మీద రూమ్ అద్దెకు తీసుకొని లిక్కర్ తయారీకి కావలసిన యంత్రాలు అన్ని తీసుకొచ్చాం. లిక్కర్ తయారీ చెయ్యండని, మంచి సమయం చూసి ప్రభుత్వం మీద నిందలు వేద్దామని జోగి రమేశ్ నాతో అన్నారని చెప్పారు.నాకు ఉన్న ఆర్థి క ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఈ పనికి ఒప్పుకోవడం జరిగిందని,,ఎందుకంటే నాకు అర్ధిక సహాయం చేస్తామని జోగి రమేశ్ హామీ ఇచ్చారన్నారు.జోగి రమేశ్ తన మనుషుల ద్వారా డిపార్ట్మెంట్ కు లీక్ ఇచ్చి తయారీ కేంద్రంపై రైడ్ చేయించారని తెలిపారు.
ఇబ్రహీంపట్నం గోడౌన్‌పై లీకులు:- చంద్రబాబు టీడీపీ వారిని సైతం సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ మరో ప్లాన్ వేశారని జనార్దన్ రావు అన్నారు. “మన ప్లాన్ వర్కవుట్ కాలేదు”. ఇబ్రహీంపట్నంలో కూడా రైడ్ చేయిద్దాం,,సరుకు తీసుకొచ్చి పెట్టు అని జోగి రమేశ్ అన్నారని తెలిపారు. ఇబ్రహీంపట్నం గోడౌన్‌లో ముందు రోజే అన్నీ తీసుకొచ్చి పెట్టాలని జోగి రమేశ్ చెప్పారని,,రమేశ్ చెప్పినట్టే లీక్ ఇచ్చి రైడ్ చేయించారని వెల్లడించారు.
జోగి.రమేష్ అనుకున్నట్లే అంతా జరిగిందని, చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, ఇక నేను రావాల్సిన అవసరం లేదని జోగి రమేశ్ అన్నారని వెల్లడించారు. అంతా నేను చూసుకుంటానని, బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి జోగి రమేశ్ హ్యాండ్ ఇచ్చారని తెలిపారు. నా తమ్ముడ్ని కూడా ఇందులో జోగి రమేశ్ ఇరికించారని అన్నారు. జోగి రమేశ్ తో నాకు చిన్నప్పటినుంచి పరిచయం ఉందని తలిపారు. నన్ను నమ్మించి జోగి రమేశ్ మోసం చెయ్యడంతో బయటకు వచ్చి నిజం చెబుతున్నా అని జనార్దన్ రావు పేర్కొన్నారు.
