పాకిస్థాన్ వైమానిక దాడులకు ప్రతికారం తీర్చుకున్న తాలిబన్
50 మంది పాకిస్థాన్ సైనికులు..
అమరావతి: అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లొని పలు ప్రాంతాల్లో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇటీవల పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడడంతో అనే మంది అమాయక పౌరులు ప్రాణాలు కొల్పోయారు. పాకిస్తాన్ దాడులపై తాలిబన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.తమ పౌరులను చంపిన “పాకిస్తాన్”,,తాలిబన్ల ప్రతికార చర్యలు ఎదుర్కొనేందుకు సిద్దంగా వుండాలంటూ హెచ్చరించింది.
50 మంది పాకిస్థాన్ సైనికులు:- శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత పాకిస్థాన్ సరిహద్దుల్లో తాలిబన్ దళాలు దాడులకు దిగాయి. ఈ దాడుల్లో 50 మంది పాకిస్థాన్ సైనికులు మరణించగా,26 మందిని బందీలుగా పట్టుకున్నారు. తాలిబన్ నేతృత్వంలోని అప్ఘన్ దళాలు డ్యూరాండ్ లైన్ వెంబడి ఉన్న పక్టియా, దక్షిణ హెల్మండ్ వెంబడి ఉన్న 14 ఔట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో వెల్లడించింది. అఫ్ఘనిస్తాన్ గగనతలంలోకి అక్రమంగా ప్రైవేశించి పాకిస్థాన్ వైమానిక దాడులకు తెగబడినందుకు ప్రతీకారంగా శనివారం అర్ధరాత్రి సమయంలో ఆపరేషన్ను చేపట్టామని అఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎనాయతుల్లా ఖోవరాజ్మి తెలిపారు.
పాకిస్థాన్ గగనతలాన్ని:- డ్యూరాండ్ లైన్ వెంట తాము చేపట్టిన ప్రతీకార చర్య కొద్ది గంటల్లో పూర్తి చేశామని పేర్కొన్నారు. మరోసారి పాకిస్తాన్, గగనతల ఉల్లంఘనకు పాల్పడితే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని,, పాకిస్తాన్ గగనతలాన్ని తప్పకుండా తాము ఆక్రమిస్తామని హెచ్చరించారు.