ఒక మత్సకారుడిగా అలోచించి మీ బాధను ఆర్దం చేసుకున్నాను-పవన్ కళ్యాణ్
అమరావతి: సముద్రంను నమ్మకుని జీవనం సాగిస్తున్న మత్సకారుడికి,,సముద్రంలో చేప దొరకకపోతే వారి బాధ ఎలా వుంటుందనేది తానకు అర్ధం అవుతుందని ఉప ముఖ్యమత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.గురువారం పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ బహిరంగ సభలో ఉపముఖ్యమంత్రి మత్సకారులను ఉద్దేశించిన మాట్లాడుతూ వేటకి వెళ్ళినప్పుడు ప్రాణాలు కోల్పోయిన కాకినాడ జిల్లాకు చెందిన 18 మత్స్యకార సోదరుల కుటుంబాలకు నష్టపరిహారం అందలేదు అని చెప్పారని,, వెంటనే 18 మంది మత్సకార కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.90 లక్షల నష్ట పరిహారం వెంటనే మంజూరు చేయించాను అని తెలిపారు. కూటమి ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద వేట నిషేధ సమయంలో 20,000 భృతిని అందించిందని గుర్తు చేశారు. మీ ప్రతి కష్టంలో తోడుండటానికే నేను ఉన్నాను అని చెప్పడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగిందన్నారు.