స్వచ్ఛ వారియర్ అవార్డును అందుకున్న శానిటరీ వర్కర్ పద్మావతి
నెల్లూరు: “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ఫ్లాగ్షిప్ కార్యక్రమం” లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించిన “స్వర్ణ ఆంధ్ర అవార్డుల కార్యక్రమం” సోమవారం విజయవాడలోని తుమ్మపల్లి కళాక్షేత్రం నందు వేదికగా ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి విభాగాల్లో విశిష్టమైన సేవలను అందించిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. అందులో భాగంగా, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన శానిటరీ వర్కర్ టి. పద్మావతికి “స్వచ్ఛ వారియర్ అవార్డు” లభించింది.
ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,,పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అలాగే స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎం.డి. మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ పురస్కారంను అందజేశారు.పరిశుభ్రత రంగంలో కృషి చేసి, సమాజానికి ఆదర్శంగా నిలిచిన టి. పద్మావతికి అవార్డు లభించడం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కు ఎంతో గర్వకారణం అయిందని ఈ సందర్భంగా అధికారులు మరియు సహచరులు ఆమెకు అభినందనలు తెలిపారు.