రోడ్లను ఆక్రమించి ఏర్పాటుచేసిన దుకాణాలు, నిర్మాణాలను తప్పనిసరిగా తొలగిస్తాం-కమిషనర్ నందన్
నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లను ఆక్రమిస్తూ దుకాణాల ఏర్పాటుకోసం నిర్మాణాలు చేపట్టవద్దని, నగరాభివృద్ధిలో భాగంగా మార్జిన్ దాటిన నిర్మాణాలను తప్పనిసరిగా తొలగించి వేస్తామని కమిషనర్ వై.ఓ. నందన్ హెచ్చరించారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడుతూ నగర అభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం నగరవ్యాప్తంగా అన్ని డివిజన్లలో రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్నామన్నారు. ప్రభుత్వ స్థలాలు, కార్పొరేషన్ స్థలాలు,ఫుట్ పాత్ లు ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
మార్కింగ్ చేస్తాం:- .మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల సూచనల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్దేశించిన జోన్లలో మాత్రమే వ్యాపారాలు నిర్వహించుకునేలా రోడ్డు మార్జిన్ వ్యాపారులకు మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని తెలియజేశారు. నిర్దేశించిన రోడ్డు మార్జిన్ ప్రతి ఒక్కరు గుర్తించేలా అన్ని ప్రాంతాలలో మార్కింగ్ చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఎస్.ఈ. రామ్ మోహన్ రావు, సిటీ ప్లానర్ హిమబిందు, MHO డాక్టర్ కనకాద్రి, మేనేజర్ రాజేశ్వరి,టి.తదితరులు పాల్గొన్నారు.