అమెరికాలో రెండు విమానులు ఢీ-ఒకరికి స్వల్ప గాయాలు
అమరావతి: న్యూయార్క్ లోని లాగార్డియా విమానాశ్రయంలోని టాక్సీవేపై రెండు డెల్టా ఎయిర్ లైన్స్ రీజనల్ జెట్‌లు ఢీకొన్నాయి. ఒక విమానం రెక్క మరొక విమానం కాక్‌పిట్ కిటికీలను ఢీకొట్టింది. బుధవారం రాత్రి 9.58 నిమిషాల సమయలో ఈ సంఘటన లాగ్వార్డియా విమానాశ్రయంలో చోటు చేసుకుంది. రెండు విమానాలను డెల్టా ఎయిర్‌లైన్స్ అనుబంధ సంస్థ అయిన ఎండీవర్ ఎయిర్ నడుపుతోంది. ఈ ప్రమాదంలో ఫ్టయిట్ అటెండెంట్ గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రెండు విమానాల్లోని ప్రయాణికులను ఖాళీ చేయించి బస్సులో టెర్మినల్‌కు తీసుకెళ్లారని విమానాశ్రయ అధికారులు తెలిపారని ఫ్యాక్స్ వార్త సంస్థ పేర్కొంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు…ఒక విమానం (5047) నార్త్ కరోలినాలోని షార్లెట్ నుంచి వచ్చి ల్యాండ్ అయిన సమయంలో, మరొక విమానం (5155) వర్జీనియాలోని రోనోక్‌కు టేకాఫ్ కు సిద్దం అవుతుంన్న సమయంలో ఘనట చోటు చేసుకుంది.ఈ ఘటనతో విమానాల రాకపోకలపై ఎలాంటి ప్రభావం చూపలేదని విమానాశ్రయం అధికార వర్గాలు తెలిపాయి.