దక్షిణకోస్తాలో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
అమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం,, ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం వుందని వాతావరణశాఖాధికారులు తెలిపారు. ప్రస్తుతానికి విశాఖపట్నంకి 400 కి.మీ.,గోపాల్‌పూర్(ఒడిశా)కి 420 కి.మీ., పారాదీప్(ఒడిశా)కి 500 కిమీ దూరంలో ఇది కేంద్రీకృతం అయ్యి వుందన్నారు. ఇది తీవ్రవాయుగుండంగా బలపడి శుక్రవారం తెల్లవారుజామున గోపాల్‌పూర్-పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం దీని ప్రభావంతో గురువారం ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్షాలు దక్షిణకోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందన్నారు.అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం వుంటుందని తెలిపారు.
అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.