AP&TG

బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం-విపత్తుల నిర్వహణ సంస్థ

అమరావతి: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడి, గురువారం నాటికి పశ్చిమమధ్య,వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది..శుక్రవారం ఉదయానికి దక్షిణఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది.ధిని ప్రభావంతో బుధవారం ఒకటి,,రెండు చోట్ల మోస్తరు-భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది..శ్రీకాకుళం, అల్లూరి,విశాఖ,కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు,మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.

రెడ్ అలర్ట్:- రాగల 3 గంటల్లో విజయనగరం,విశాఖ, అల్లూరి,అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు ఈదురుగాలులు వీచే అవకాశం వుందని,, చెట్ల కింద నిలబడరాదని ప్రజలు విపత్తుల నిర్వహణ సంస్థ ఎం,డీ.ప్రఖర్ జైన్ తెలిపారు..

ఎల్లో అలెర్ట్:-  బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం వుందని పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *