తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
హైదరాబాద్: తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేస్తున్నారు..అక్టోబర్ 1వ తేదీన తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా practise చేసి తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి 1994లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లోకి ప్రవేశించారు.ఉమ్మడి ఏ.పిలో ASPగా విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో పని చేశారు.గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్ గా, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల SPగా బాధ్యతలు నిర్వహించారు.