NATIONAL

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ముగిసిన ఫైటర్‌ జెట్‌ మిగ్‌-21 శకం

అమరావతి: భారత వైమానిక దళం (IAF‌) చరిత్రలో రష్యా మేడ్ ఫైటర్‌ జెట్‌ మిగ్‌-21 శకం నేటితో ముగిసింది.. 62 సంవత్సరాల సుదీర్ఘ సేవల అనంతరం మిగ్‌ ఫైటర్‌ జెట్లుకు వాయుసేన విశ్రాంతిని ఇచ్చింది.భారత వాయుసేనకు కొన్ని దశాబ్దాలుగా నమ్మ తగ్గిన ఫైటర్‌ జెట్‌ గా వున్న మిగ్‌-21ఎన్నో క్లిష్ట సమయల్లో అదుకుంది. ఫైటర్‌ జెట్స్‌ కు చండీగఢ్‌ వాయుసేన కేంద్రం వేదికగా జరిగిన ఫేర్‌వెల్‌ కార్యక్రమంలో వాయుసేన చీఫ్‌ ఏపీ సింగ్‌ శుక్వరారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా పలువురు సీనియర్‌ అధికారులు, మాజీ ఫైలెట్ లు హాజరయ్యారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *