ఓటర్ల జాబితా సవరన నిరంతరంగా కొనసాగుతుంది-కలెక్టర్ హిమాన్షు
నెల్లూరు: ఓటర్ల జాబితా నవీకరణ పారదర్శకంగా నిరంతరంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. గురువారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫారం 6 లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఫారం 6 లను సంపూర్ణంగా పూర్తిచేసే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు నూతన ఓటర్లకు అవగాహన కలిగించాలన్నారు. అదేవిధంగా చనిపోయిన వారిని ఓటరు జాబితా నుండి తొలగించేందుకు వారి మరణ ధ్రువీకరణ పత్రాలను పొందే విధంగా వారి కుటుంబ సభ్యులను ప్రోత్సహించాలన్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో DRO విజయ్ కుమార్, TDP-రసూల్,YSRCP-వెంకట శేషయ్య, CONG-బాల సుధాకర్,BSP- శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు.