లడఖ్‌లో అల్లర్లు, హింస వెనుక కాంగ్రెస్ కౌన్సిలర్ స్టాన్జిన్ త్సెపాంగ్-బీజెపీ
రాహుల్ గాంధీ, జార్జ్ సోరోస్‌తో కలిసి..
అమరావతి: లడఖ్‌లో బుధవారం జరిగిన అల్లర్లు, హింస వెనుక కాంగ్రెస్,,పర్యావరణ ఉద్యమకారుడు అని చెప్పుకునే సోనమ్ వాంగ్‌చుక్ కారణమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరోపించింది.కేంద్ర పాలిత ప్రాంతంగా వున్న లడఖ్ కు రాష్ట్రస్థాయి హోదా అనే డిమాండ్‌పై జరిగిన సామూహిక హింసకు వాంగ్‌చుక్ “రెచ్చగొట్టే ప్రకటనలు” కారణమని ఒక ప్రకటనలో తెలిపింది.. ఈ రాష్ట్ర హోదా ఉద్యమం కారణంగా లేహ్‌లో హింస, ఘర్షణలకు దారితీసింది. ఈ అల్లర్లలో నలుగురు మరణించగా,, 22 మంది పోలీసు సిబ్బందితో సహా కనీసం 59 మంది గాయపడ్డారని పేర్కొంది..
బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పీన్స్ జరిగిన ఆరాచక:-లడఖ్‌లో హింసను ప్రేరిపించి….. బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పీన్స్ దేశాల్లో మాదిరిగానే ఆరాచక పరిస్థితులను సృష్టించేందుకు కాంగ్రెస్ “దుర్మార్గపు కుట్ర”లో భాగమని బీజేపీ ఆరోపించింది..“లడఖ్‌లో కొన్ని నిరసనలను ‘జనరల్ జెడ్’ నాయకత్వంలో చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని,, దర్యాప్తులో ఇది జనరల్ జెడ్ నిరసన కాదని, వాస్తవానికి కాంగ్రెస్ నిరసన అని తేలిందని అని బీజేపీ ఎంపీ,,బీజెపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు..
కాంగ్రెస్ కౌన్సిలర్ కౌన్సిలర్:- “కాంగ్రెస్ కౌన్సిలర్ స్టాన్జిన్ త్సెపాంగ్ అప్పర్ లేహ్ వార్డుకు చెందిన కౌన్సిలర్,, యువతను,,కార్మికులను హింసకు పాల్పపడే విధంగా రెచ్చగొడుతున్నట్లు అనేక ఫోటోలు బయటపడ్డాయి.. ఆయన చేతిలో కత్తి లాంటి ఆయుధంతో బీజేపీ కార్యాలయం వైపు కవాతు చేస్తున్నట్లు కూడా ఫోటోలు,,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
రాహుల్ గాంధీ, జార్జ్ సోరోస్‌తో కలిసి:- కౌన్సిలర్ స్టాన్జిన్ త్సెపాంగ్, ప్రజలను రెచ్చగొట్టి బీజేపీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు.. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటపడింది.. బీజేపీ కూడా ఈ వీడియోను పోస్ట్ చేసింది… ” కాంగ్రెస్ కౌన్సిలర్ స్టాన్జిన్ త్సెపాంగ్ రాహుల్ గాంధీతో ఉన్నారు” అని సంబిత్ పాత్రా ఆరోపించారు.. రాహుల్ గాంధీ జార్జ్ సోరోస్‌తో కలిసి వేసిన ప్లాన్..ఎన్నికల్లో ద్వారా గెలవలేరని తెలుసుకున్న వీళ్లు,,దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నుతున్నారని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర ఆరోపించారు.