రాష్ట్రంలో అనధికారంగా ఏర్పాటు చేసిన 2,524 విగ్రహాలు తొలగింపుకు చర్యలు-మంత్రి జనార్దన్ రెడ్డి
అమరావతి: అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాలపై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు..విగ్రహాల తొలగింపుపై మార్గదర్శకాల ప్రకారం పరిశీలన చేసి తగు చర్యలు తీసుకుంటామని తలిపారు.శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి,, పులివెందులలో ప్రజా నిధులను దుర్వినియోగం చేసి అనధికారికంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేశారని ఆరోపించారు..రాష్ట్రవ్యాప్తంగా అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయడంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు..
అనధికారంగా 2,524 విగ్రహాలు:- శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు, మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సమాధానం ఇస్తూ రాష్ట్రంలో మొత్తం 2,524 విగ్రహాలు అనధికారంగా ఏర్పాటు చేశారని తెలిపారు..2019లో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఇప్పటివరకు కొత్త విగ్రహాలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు..బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు ముందు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని, లేనిపక్షంలో వాటిని తొలగించే చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.