స్వామీజీ లైగింక వేధింపులు-వాస్తవాలు దర్యాప్తులో వెలుగులోకి వస్తాయి-డీసీపీ అమిత్ గోయల్
అమరావతి: ఢిల్లీలోని శ్రీ శారద ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్‌లో పనిచేస్తున్న స్వామి చైతన్యానంద సరస్వతి@పార్థసారధి అనే స్వామీజీపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. బలహీనవర్గాల కేటగిరీలో పీజీ మేనేజ్మెంట్ డిప్లామా కోర్సులు చదువుతున్న విద్యార్థినులు స్వామీజీ తమపై లైంగిక వేధింపులకు పాల్పపడుతున్నరంటూ చేసిన ఫిర్యాదు ఆదారంగా కేసు నమోదు చేశారు.
17 మంది యువతులు ఆరోపణలు:- శృంగేరిలోని దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం, ఢిల్లీలో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నది.. ఢిల్లీ పీఠానికి చెందిన యూనిట్‌లో రెండు బ్యాచ్‌లు ఉన్నాయి.. ఒక్కొక్క బ్యాచ్‌లో 35 స్టూడెంట్స్ ఉంటారు.. సదరు ఆశ్రమంలోని 32 మంది విద్యార్థినులను పోలీసులు విచారించగా,ఇందులో దాదాపు 17 మంది అమ్మాయిలు స్వామీ చైతన్యానందపై ఆరోపణలు చేశారు.. ద్వేషపూరిత భాషను వాడుతున్నారని,, శృంగారభరిత టెక్ట్స్ మెసేజ్‌లు చేస్తున్నారని,, భౌతికంగా తాకేందుకు ప్రయత్నిస్తున్నారని మహిళలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. డైరెక్టర్‌కు లొంగిపోవాలని ఆ ఆశ్రమంలోని మహిళా సిబ్బంది, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది కూడా వత్తిడి చేస్తున్నట్లు విద్యార్థినులు ఆరోపించారు.
వాస్తవాలు దర్యాప్తులో వెలుగులోకి వస్తాయి:- స్టూడెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్వామీ చైతన్యానందపై లైంగిక వేధింపుల కేసు బుక్ చేసినట్లు డీసీపీ అమిత్ గోయల్ తెలిపారు..నిందితుడి అడ్రస్‌లో తనిఖీలు నిర్వహించారు.. దర్యాప్తు సమయంలో ఇన్స్ టిట్యూట్ బేస్మింట్‌లో ఉన్న వోల్వో కారును పోలీసులు స్వాధీనం చేస్తుకున్నారు.. ఆ వాహనాన్ని స్వామీ చైతన్యానంద వాడినట్లు గుర్తించారు..ఆ కారును పోలీసులు సీజ్ చేశారు..ఆ స్వామీజీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు..వాస్తవాలు దర్యాప్తులో వెలుగులోకి వస్తాయని డీసీపీ అమిత్ గోయల్ పేర్కొన్నారు.