కార్మికుల ఆగ్రహంతో, ప్రాణ భయంతో ఘటనా స్థలం నుంచి పరారైన పోలీసులు
తెలంగాణ: తెలంగాణలోని సూర్యాపేట పాలకీడు వద్ద వున్న దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది..ఇటీవల ఫ్యాక్టరీ ప్రమాదంలో బీహార్ కు చెందిన కార్మికుడు మృతి చెందడంతో నష్టపరిహారం ఇస్తామని చెప్పి మేనేజ్మెంట్ మాట తప్పడంతో ఆగ్రహించిన కార్మికులు ఫ్యాక్టరీ పై బీహార్ కార్మికుల దాడి,అద్దాలు,ఫర్నీచర్ ధ్వంసం చేసి సోమవారం ధర్నాకు దిగారు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని,,వారిని చెదరకొట్టి,పరిస్థితి అదుపుచేసేందుకు ప్రయత్నించారు.. తొటి కార్మికుడు మరణించడం,,యాజమాన్యం మాట తప్పడంతో అగ్రహాంతో వున్న కార్మికులు రెచ్చిపోయారు..పోలీసుల పైనా దాడికి దిగిన ఆందోళన కారులు,,పోలీసులను పరుగులు పెట్టించి కర్రలతో కొట్టారు..అంతటితో అగకుండా పోలీసు వాహనం పై రాళ్ళ దాడి చేశారు. దింతో పోలీసు వాహనం ధ్వసం అయింది.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.

