దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్న మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్
అమరావతి: మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోనున్నారు. కేంద్రం ఆయనకు సినిమా రంగంలోనే అత్యున్నతమై దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది. ఈ అవార్డును సెప్టెంబర్ 23, 2025న జరిగే 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ప్రదానం చేస్తారు.సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసి సేవలకు గానూ కేంద్రం ఈ అవార్డు ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. 2023 ఏడాదికి గానూ మోహన్‌లాల్‌కు ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మోహన్‌లాల్ అద్భుతమైన సినిమా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని,, భారతీయ సినిమాకు ఆయన చేసిన అద్భుతమైన కృషికి గానూ ఈ అవార్డును అందిస్తున్నట్లు వెల్లడించింది. ఆయన అసమాన ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, అవిశ్రాంత కృషి భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక బంగారు ప్రమాణాన్ని నెలకొల్పాయి’’ అని పేర్కొంది.