రాహుల్ గాంధీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు-ఎన్నికల సంఘం
అమరావతి: రాహుల్ గాంధీ, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగినట్లు చేస్తూన్న ఆరోపణలపై గురవారం కేంద్ర ఎన్నికల సంఘం(E.C.I) తీవ్రంగా ఖండించింది. సదరు ఆరోపణలు నిరాధారమైనవి, అబద్ధమని ఈసీ స్పష్టం చేసింది. ఆన్‌లైన్ పద్ధతిలో ప్రజలు ఓట్లను డిలీట్ చేయడం కుదరదని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తూ,, రాహుల్ గాంధీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఓటరు సంబంధిత ఫారమ్ అందించిన తరువాతనే తొలగింపు ప్రక్రియ జరుగుతుందని ఈసీఐ ఓ ప్రకటనలో పేర్కొన్నది.
ఘాటుగా స్పందించిన ఈసీ:- కర్నాటకలోని అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లు డిలీట్ అయినట్లు రాహుల్ చేసిన ఆరోపణలపై ఈసీ ఘాటుగా స్పందిస్తూ,,సంబంధిత నియోజకవర్గంలో జరిగిన అక్రమాలను 2023లో ఎన్నికల సంఘం బయట పెట్టినట్లు తెలిపింది. ఓటర్ల తొలగింపు కోసం ప్రయత్నాలు జరిగాయని,,ఈ విషయంను పట్ల ఎన్నికల సంఘం FIR నమోదు చేసినట్లు ఈసీ తన ప్రకటనలో స్పష్టం చేసంది.
రాహుల్ గాంధీ ఆసత్య ఆరోపణలు:- అలంద్ నియోజకవర్గ సీటును 2018లో బీజేపీ అభ్యర్థి సుబద్ గుత్తేదార్,, 2023లో కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ పాటిల్ గెలిచినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.CEC జ్ఞానేశ్ కుమార్‌ను రాహుల్ గాంధీ లక్ష్యంగా చేసుకుని ఆసత్య ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. జ్ఞానేశ్ కుమార్ 6 నెలల క్రిందట CECగా బాధ్యతలు చేపట్టారని,అయితే సంవత్సరం క్రిందట అక్రమాలు జరిగినట్లు రాహుల్ ఆరోపించినట్లు ఈసీ వర్గాలు తెలిపాయి.